KRNL: తుగ్గలి గ్రామానికి చెందిన రైతు పోతురాజు శివ ఇటీవల రూ.69 వేలతో కొనుగోలు చేసిన ఆవు అనారోగ్యంతో మృతి చెందింది. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆవుకు ప్రభుత్వ పశువుల ఆసుపత్రిలో చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. సోమవారం లేగదూడకు జన్మనిచ్చిన ఆవు ఇవాళ చనిపోవడంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. ప్రభుత్వం చొరవ చూపి తమను ఆదుకోవాలని వారు కోరారు.