ASF: సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని సిర్పూర్ పేపర్ మిల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు, CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ డిమాండ్ చేశారు. మంగళవారం అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్‌ని కలిసి ఎన్నికల అవశ్యకతపై విన్నవించారు. లేబర్ కమిషనర్ జోక్యం చేసుకుని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేలా చూడాలన్నారు.