MNCL: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు అసత్య ఆరోపణలతో చేసే అపోహలు, వదంతులను రైతులు నమ్మవద్దని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లా అధికార యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.