కడప జిల్లా చక్రాయపేట మండలం అద్దాలమర్రి క్రాస్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గువ్వలచెరువు ఘాట్ రోడ్లో గ్యాస్ లారీ ప్రమాదానికి గురికావడంతో వాహనాలను వేంపల్లి మార్గంలో మళ్లించారు. అదే సమయంలో రోడ్డు పనులు కొనసాగుతుండటంతో ట్రాఫిక్ తీవ్రంగా నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.