GDWL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు జరిగిన ఈ పరీక్షకు మొత్తం 92 మంది విద్యార్థులకు గాను 87 మంది హాజరయ్యారని, ఐదుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి (డీఈవో) విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.