MDK: జిల్లాలో పదోన్నతి పొందిన అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలని ఎస్పీ డీ.వీ శ్రీనివాసరావు సూచించారు. ఇటీవల ఏఎస్సై నుంచి ఇన్ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన కృష్ణ, కృష్ణయ్యలు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారి భుజాలపై నక్షత్రాలను అలంకరించారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలంటూ వారికి సూచనలు చేశారు.