TG: డీజీపీ సీవీ ఆనంద్‌ను మాజీ ఎమ్మెల్సీ ప్రొ.నాగేశ్వర్ కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాల్లో తనపై చేస్తున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. తన వ్యాఖ్యలను ఇప్పటికే ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ప్రొ.నాగేశ్వర్ స్పష్టం చేశారు.