GNTR: కలెక్టర్ సీ.యం. సాయికాంత్ వర్మ రైతులకు ప్రత్యేక ఎరువుల కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. రైతులు అవసరమైన పరిమితిలోనే ఎరువులు వినియోగించేలా జూన్ తొలి వారంలో కార్డులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, ఖరీఫ్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా సిద్ధం చేసినట్లు వెల్లడించారు.