SS: ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే డిజిటల్ మహానాడు ఏర్పాట్లను మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరిశీలించారు. బుక్కపట్నం మండలం క్లస్టర్ 03, క్లస్టర్ 04 పరిధిలో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో చూశారు. వర్చువల్ విధానంలో జరిగే ఈ పండుగను విజయవంతం చేయాలని పిలిచారు. కార్యకర్తలు, నాయకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.