ELR: ప్రపంచ ప్రసిద్ధ కొల్లేరు సరస్సు పరిధిలోని ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రం అధికారుల నిర్లక్ష్యంతో ఎడారిలా మారుతోందని వన్యప్రాణి ప్రేమికులు ఆరోపిస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు పరిధిలోని 286 ఎకరాల్లో ఉన్న ఈ కేంద్రంలో ప్రస్తుతం చుక్కనీరు లేక నేలలు బీటలు వారాయని వాపోతున్నారు. వేలాది వలస పక్షులు ఆహారం, ఆవాసం దొరకక అల్లాడిపోతున్నాయి.