ASR: కొయ్యూరు మండలంలో ప్రకృతి వ్యవసాయం సాగు చేసే రైతులకు 50క్వింటాళ్ల జనుము, 20క్వింటాళ్ల పిల్లిపెసర, 10క్వింటాళ్ల జీలుగ రకాల పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఏవో పీ.శివరామ్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం చీడిపాలెం రైతు సేవా కేంద్రంలో వీఏఏ కల్యాణితో కలిసి రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. మండలంలోని 17ఆర్ఎస్కేల్లో విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు.