TPT: తిరుపతిలో మే 21 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న ఏటీసీ-4 క్యాంప్‌లో పాల్గొంటున్న ఎన్సీసీ విద్యార్థులు క్రమశిక్షణ, సేవాభావం, లక్ష్యసాధనతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సూచించారు. ఎన్సీసీ గర్ల్స్ బెటాలియన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఐదు జిల్లాలకు చెందిన సుమారు 600 మంది క్యాడెట్లు పాల్గొంటున్నారని తెలిపారు.