TPT: ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ప్రతినిధులు మంగళవారం తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ఎంపీతో చర్చించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తానని ఎంపీ గురుమూర్తి హామీ ఇచ్చారు.