HYD: అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో ప్రతిభ చాటుతున్న యువ సెయిలర్ రమీజా భానును రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క సచివాలయంలో అభినందించారు. ఒమన్, సింగపూర్ పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన రమీజా భాను, త్వరలో మొరాకోలో జరిగే అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. తెలంగాణ యువత దేశానికి కీర్తి తీసుకురావడం గర్వకారణమని మంత్రి తెలిపారు.