SDPT: భద్రాచల రామయ్య ముత్యాల తలంబ్రాలను, కల్యాణ వస్త్రాలను ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి-రమాదేవి దంపతులకు శ్రీరామకోటి భక్త సమాజం అధ్యక్షులు రామకోటి రామరాజు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రామరాజు గత 30 ఏళ్లుగా చేస్తున్న ఆధ్యాత్మిక సేవలు అమోఘమని కొనియాడారు. రామయ్య కల్యాణం కోసం 300 కిలోల గోటి తలంబ్రాలు అందించారు.