ATP: బక్రీద్ పండుగ వేళ జిల్లాలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని SP జగదీష్ ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా మసీదులు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించి పండుగ ప్రశాంతంగా జరిగేలా చూడాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అభ్యంతరకర పోస్టులపై సైబర్ విభాగం నిరంతరం నిఘా ఉంచుతుందన్నారు.