NRPT: పట్టణంలోని అశోక్ నగర్ గజలేశ్వరీ మాత ఆలయంలో మంగళవారం జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గొడుగుగేరి నుంచి అమ్మవారి పల్లకి సేవ, జల్దిబిందె, పెద్దబొనం, ఉద్దాలోత్సవం, పాలుచల్లే కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పెద్దఎత్తున బోనాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.