MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ టీచర్స్ కాలనీలో విద్యుత్ స్తంభాల మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు, గాలులకు తీగలు తెగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రమాదాలు జరగకముందే కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని సత్యనారాయణ స్వామి దేవాలయం సమీప నివాసులు ఏఈ ఎర్రన్నకు వినతిపత్రం అందజేశారు.