AP: పార్టీ కార్యకర్తలు నాయకులుగా ఎదగడానికి క్లస్టర్ విధానంలో మహానాడు పనికొస్తుందని TDP అధినేత చంద్రబాబు అన్నారు. ఈ సారి ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో ఈ వేడుకను నిర్వహిస్తున్నామని, మహానాడులో సరైన మార్గనిర్దేశం చేసుకొని దీన్ని అమలు చేస్తామని తెలిపారు. నాయకుల్లో జవాబుదారీతనం ఉంటేనే ప్రజలు విశ్వసిస్తారని, కార్యకర్తలు అన్ని విధాలా సాధికారత సాధించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.