NTR: మైలవరంలో జరిగిన ఏపీ రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా 46వ మహాసభల్లో రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య రైతాంగ సమస్యలపై విస్తృత ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేక అప్పుల్లో కూరుకుపోతున్నారని, వ్యవసాయ భూములను పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నారని ప్రభుత్వంపై విమర్శించారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.