PDPL: ధర్మారం మండలం నంది మేడారం, పత్తిపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, KDCMS కొత్తూరులో సబ్సిడీపై జీలుగ, జనుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి ప్రకాష్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. జనము 40 కిలోల బస్తా రూ. 3,110, జీలుగ 30 కిలోల బస్తాకు రూ. 2,453 చెల్లించి రైతులు పొందవచ్చని ఆయన సూచించారు.