AKP: నక్కపల్లి మండల కేంద్రంలో ఈనెల 27, 28వ తేదీల్లో నిర్వహించే మహానాడు ఏర్పాట్లను పాయకరావుపేట నియోజకవర్గం టీడీపీ పరిశీలకురాలు ఈతపాక సుజాత మంగళవారం సాయంత్రం పరిశీలించారు. కార్యకర్తలకు ఎటువంటి అసౌకర్యం కలక్కుండా చూడాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:00 వరకు మహానాడు జరుగుతుందన్నారు. వర్చువల్ విధానంలో జరిగే మహాసభను విజయవంతం చేయాలని కోరారు.