ADB: PM అజయ్ పథకం కింద జిల్లాలోని 6 గ్రామాలు ఎంపికయ్యని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో షెడ్యూల్డ్ కులాల సమగ్ర అభివృద్ధి కోసం PM అజయ్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో పేదరిక నిర్మూలన, అదనపు ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక వసతుల మెరుగుదల, నాణ్యమైన విద్యా సంస్థలలో వసతులు కల్పించడం పథకం ఉద్దేశమని పేర్కొన్నారు.