VZM: బక్రీద్ పండగను మతసామరస్యానికి ప్రతీకగా కుల, మతాలకు అతీతంగా సోదర భావంతో, శాంతియుతంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పిలుపునిచ్చారు. విజయనగరంలోని ముస్లిం మత పెద్దలతో జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం, ముస్లిం సోదరులకు ఎస్పీ బక్రీద్ శుభాకాంక్షలను తెలిపారు.