కరీంనగర్ కార్పొరేషన్ భవనం రెండో అంతస్తు నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మంగళవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. రూ 1.39 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. వీటితోపాటు కార్మిక ఆరోగ్య సంక్షేమ భవన పునరుద్దరణ, షెడ్ల మరమ్మతు పనులను ప్రారంభించారు. కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.