KDP: రాజుపాలెం మండలంలో అసాంఘిక శక్తుల కదలికలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఈ-చలానాలు విధించనున్నట్లు, అనుమానాస్పద ఘటనలపై డయల్ 112కు సమాచారం ఇవ్వాలని ఎస్సై ప్రణయ్ కుమార్ రెడ్డి ప్రజలకు సూచించారు.