PLD: పర్యావరణం, ఇంధన పొదుపుపై అవగాహన కోసం చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆదర్శంగా నిలిచారు. వినుకొండలో తన ఇంటి నుంచి సీహెచ్‌సీకి ఆయన ఎలక్ట్రిక్ స్కూటర్‌పై వెళ్లారు. అక్కడ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందేలా బాధ్యతగా పనిచేయాలని సభ్యులకు ఆయన సూచించారు.