NZB: ఎడపల్లి మండల కేంద్రంలో మంగళవారం వీధి కుక్కల దాడిలో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. గ్రామానికి చెందిన బొడీకి లక్ష్మీ ఇంటి సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా కుక్కల గుంపు అకస్మాత్తుగా ఆమెపై దాడి చేసింది. కుక్కలు కరవడంతో తల, చెంప, మెడ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.