KMM: కామేపల్లి మండలం ముచ్చర్ల అంగన్వాడి కేంద్రం నందు మంగళవారం ICDS ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై బాలికలకు అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. చట్ట ప్రకారం బాల్య వివాహాలు చేయవద్దని, బాల్యవివాహాలు చేయడం ద్వారా జరిగే అనర్థాలను సర్పంచ్ జాయ్ లూసీ వివరించారు. అనంతరం బాలికలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, సూపర్వైజర్ తదితరులు పాల్గొన్నారు.