AP: రాష్ట్రంలో భానుడి ఉగ్రరూపం కొనసాగుతోంది. గుంటూరు జిల్లా ములుకుదురులో అత్యధికంగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కంచికచర్ల, ఇంకొల్లులో 47.3 డిగ్రీలు, కొండపిలో 46.7 డిగ్రీలు, పెద్దదోర్నాలలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తంగా 14 జిల్లాల పరిధిలోని 125 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.