MNCL: మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని టోల్గేట్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్‌పోస్ట్ వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, వాహనాలు పశువుల వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.