BDK: దమ్మపేట మండలం లింగాలపల్లి గ్రామానికి చెందిన సోయం లాలు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కోమాలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు చికిత్స నిమిత్తం రూ.25,000 ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం వైద్యులతో మాట్లాడి లాలు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.