KRNL: నెల్లూరు జిల్లా జలదంకికి చెందిన సురేష్ ఉలిందకొండలో ఇటుకల బట్టీ నిర్వహిస్తున్నాడు. కొత్తూరు చెరువు నుంచి టిప్పర్లో మట్టిని తరలిస్తుండగా మంగళవారం వాహనం ఒరిగింది. దీంతో పైభాగంలో ఉన్న మట్టి ముద్ద సురేష్ తలపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.