NLG: దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధాన్యం సేకరణ, కొనుగోలు వేగవంతంపై ఎమ్మెల్యే బాలునాయక్ మంగళవారం రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్నదాతల ప్రయోజనాలే పరమావధిగా, కొనుగోళ్లలో జాప్యం లేదా నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.