NRML: మహిళలు ఆత్మవిశ్వాసంతో అభివృద్ధి సాధించాలని మంచిర్యాల జాయింట్ కలెక్టర్ కేంద్రీయ సూచించారు. మంగళవారం దండేపల్లి మండల కేంద్రంలో మహిళలకు ఇస్తున్న మగ్గం వర్క్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. ఆత్మవిశ్వాసంతో మహిళలు శిక్షణను పూర్తిచేసుకుని ముందడుగు వేయాలని సూచించారు.