SDPT: శక్తి స్వరూపిణి రేణుక ఎల్లమ్మ తల్లి మహిమ అపారమని తల్లి ప్రజలందరినీ చల్లంగా చూడాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి వేడుకున్నారు. తొగుట మండలం వెంకట్రావుపేటలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఎల్లమ్మ -జమదగ్ని కళ్యాణ మహోత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు.