ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా విద్యాధికారి లలిత మంగళవారం ప్రారంభించారు. పాఠశాలలు పునఃప్రారంభానికి ముందే పుస్తకాలు అన్ని పాఠశాలలకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందేలా ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.