ADB: బాల్య వివాహ రహిత జిల్లాగా ఆదిలాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం గుడిహత్నూర్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా వారోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. బాల్య వివాహాలు చేయడం చట్టరిత్యా పెద్ద నేరమని పేర్కొన్నారు.