NGKL: బక్రీద్ పండుగ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో జంతు వధ నిషేదమని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా ఎవరైనా జంతు వధ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిగ్రీ కాలేజ్ ఈద్గా వద్ద మున్సిపల్ కార్యాలయం తరఫున ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు నిబంధనలు పాటించి సహకరించాలని కోరారు.