TPT: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నయనాల జయసూర్య కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ EO B.K. వెంకటేశులు ఘనస్వాగతం పలికారు. న్యాయమూర్తి దంపతులు ఆలయంలో ప్రత్యేకంగా రాహు-కేతు పూజలు, స్వామివారి అభిషేకం మరియు అంతరాలయ దర్శనం చేసుకున్నారు. అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం పలకగా, ఆలయ ఈవో తీర్థప్రసాదాలను అందజేశారు.