వరంగల్ నగరంలోని పోస్ట్ ఆఫీస్ జంక్షన్లోని మున్సిపల్ కాంప్లెక్స్ స్థలంలో ఏర్పాటు చేసిన చిరు వ్యాపారుల దుకాణాలను ఇవాళ పోలీసులు తొలగించారు. పార్కింగ్ సమస్యల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ ఏసీపీ టి. సత్యనారాయణ ఆధ్వర్యంలో సీఐ కే. సుజాత, ఇంతేజార్గాంజ్ సీఐ షుకూర్ ఆక్రమణలను తొలగించి పూల దుకాణాలను లోపలికి తరలించారు.