AP: తన నియోజక వర్గంలో సమస్యలను తెలుసుకోవడానికి నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ‘నన్ను ప్రశ్నించండి’ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓటేసి గెలిపించిన ప్రజలకు ప్రశ్నించే హక్కు కూడా ఉందని చెప్పారు. యువతలో ప్రశ్నించేతత్వం రావాలని ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన్నట్లు తెలిపారు. నియోజకవర్గ సమస్యలను 8557999999 నెంబరుకు ఫోన్ చేసి చెప్పాలని కోరారు.