TG: కాంగ్రెస్‌లో ప్రతి పదవీ భవిష్యత్తుకు పునాది అని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ‘రైతులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. దేశంలో తొలిసారి కుల సర్వే చేసిన ఘనత కాంగ్రెస్‌దే. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే. చేవెళ్ల డిక్లరేషన్‌పై BRS వ్యాఖ్యలు సిగ్గుచేటు’ అంటూ మండిపడ్డారు.