SRCL: వేములవాడలో ఆత్మ కమిటీ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. రాజశ్రీ గార్డెన్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమిటీ ఛైర్మన్, డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధికి ఆత్మ కమిటీ కీలక పాత్ర పోషించాలన్నారు.