BDK: భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం, అక్రమ వసూళ్లు జరుగుతున్నాయంటూ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేట్ జిల్లా అధ్యక్షుడు డా. మారెల్లి విజయకుమార్ కలెక్టర్, డీఎంహెచ్‌వోకు వినతిపత్రం సమర్పించారు. ఆసుపత్రుల్లో డాక్టర్లు అందుబాటులో లేకపోవడం, సిబ్బంది అక్రమ వసూళ్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.