NDL: కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ ప్రెస్మీట్లు పెడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి ఆరోపించారు. నంద్యాలలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ ప్రజలకు నిజనిజాలు తెలుసని ఎమ్మెల్యే ఘాటుగా వ్యాఖ్యానించారు.