VSP: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి తీవ్ర హానికరమని, ప్రజలు పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ డా. ఈ.ఎన్.వి. నరేష్ కుమార్ పిలుపునిచ్చారు. సీతమ్మధార రైతు బజార్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకు బదులుగా వస్త్ర, నార, పేపర్ బ్యాగులు వాడాలన్నారు.