VZM: రాష్ట్ర ప్రధాన భూ పరిపాలన కమిషనర్ నిర్వహించిన రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, జేసీ ఎస్. సేధు మాధవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో రీ-సర్వే పనులు, పట్టాదారు పాస్బుక్ల పంపిణీ, ఈ-కేవైసీ ప్రక్రియ కార్యక్రమాల గురించి చర్చించారు. అలాగే, నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.