ASR: కొయ్యూరు మండలంలో 7,410మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్దిదారులకు రూ.3,11,69,000సొమ్ము మంజూరైనట్లు ఎంపీడీవో ప్రసాదరావు మంగళవారం తెలిపారు. ఈనెల 30న పెన్షన్ సొమ్మును బ్యాంకుల నుంచి విత్ డ్రా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. జూన్ 1వ తేదీ సోమవారం ఉదయం నుంచి లబ్దిదారులకు పెన్షన్లను పంపిణీ చేయాలన్నారు. లబ్ధిదారులందరూ ఇళ్ల వద్దే అందుబాటులో ఉండి సహకరించాలన్నారు