BPT: సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌తో రాజకీయ పార్టీల నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆప్ బాపట్ల జిల్లా అధ్యక్షుడు ఆట్ల బాలాజీ పాల్గొన్నారు. ఓటర్ల జాబితాలో డోర్ నంబర్లు వరుసలో లేవని ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదన్నారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల సమావేశాల నిర్వహణ సమస్యలపై సీఈవోకు వినతిపత్రం ఇచ్చారు.